కే లో ఇండియా వాలీబాల్ క్రీడలకు ఎంపిక

27-10-2026 | 04:20pm

తాడ్వాయి,అక్టోబర్,27( విజయ క్రాంతి ): ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కే లో ఇండియా వాలీబాల్(Khelo India volleyball) క్రీడలకు బాల, బాలికలను ఎంపిక చేసినట్లు తాడ్వాయి కి చెందిన సీనియర్ జాతీయస్థాయి వాలీబాల్ క్రీడాకారుడు తాటిపాముల ప్రదీప్ గౌడ్ తెలిపారు.కే లో ఇండియా వాలీబాల్ క్రీడల ఎంపికలకు ఉమ్మడి జిల్లాల నుంచి 132 మంది బాలురు,65 మంది బాలికలు  పాల్గొన్నారన్నారు.

ఇందులో 15 మంది బాలికలను,19 మంది బాలురును ఈ క్రీడలకు ఎంపిక చేసినట్లు ఆయన వివరించారు.ఇట్టి క్రీడాకారులను పూర్తిగా పారదర్శకంగా ఎంపిక చేశామని తెలిపారు.ఈ కార్యక్రమంలో 62 మంది వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నట్లు ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు