ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను సహించేది లేదు

24-10-2026 | 08:27pm

తూప్రాన్ తహసిల్ దార్ 

తూప్రాన్, అక్టోబర్ 24, (విజయక్రాంతి): మండలంలోని రావెల్లి పరిధిలో గల సర్వే నంబర్ 235, ప్రభుత్వ భూమి(Government land) గీతరెడ్డి కాలనీ ప్రభుత్వ పాఠశాల పక్కన చేపట్టిన అక్రమ నిర్మాణాలను(illegal constructions) తూప్రాన్ ఎమ్మార్వో ఆదేశాల మేరకు తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి(Tehsildar Chandrashekhar Reddy) మాట్లాడుతూ, ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు, నిబంధనల మేరకు శిక్షలు విధించబడతాయని హెచ్చరించారు.

తూప్రాన్ మండల పరిధిలోని ఏ గ్రామంలోనూ ప్రభుత్వ భూములను ఆక్రమించడం లేదా వాటిలో అక్రమ నిర్మాణాలు చేపట్టడం వంటి చర్యలకు ఎవరూ పాల్పడరాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు రెవెన్యూ శాఖ నిరంతరం చర్యలు చేపడుతుందని తెలిపారు. ఇందులో గిర్ధవర్, జిపిఓలు నాగరాజు, బాబు, రమేష్ లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు