ప్రజావాణికి రెండు దరఖాస్తులు..
26-10-2026 | 07:49pm
పాపన్నపేట, అక్టోబర్26: పాపన్నపేట ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి(Prajavani) ప్రశాంతంగా జరిగింది. కొడపాక గ్రామంలో విద్యుత్ స్తంభాలకు వైర్లు ఏర్పాటు చేయాలని, నాగ్సాన్‌పల్లికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ రెండు దరఖాస్తులు అధికారులకు అందాయి. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విష్ణువర్ధన్, తహశీల్దార్ సతీష్‌కుమార్, హౌసింగ్ ఏఈ అరుణ్, అబ్కారీ అధికారి దేవరాజు, ఆర్అండ్‌బీ ఏఈ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.