షినావత్రా, అనురాగ్ యూనివర్సిటీ ల కీలక ఒప్పందం
ఘట్ కేసర్, అక్టోబర్ 2 (విజయక్రాంతి) : అంతర్జాతీయ విద్యా భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా అనురాగ్ యూనివర్సిటీ(Anurag University ) మరో కీలక ముందడుగు వేసింది. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌కు చెందిన షినావత్రా యూనివర్సిటీతో(Shinawatra University) అనురాగ్ యూనివర్సిటీ మెమొరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ కుదుర్చుకుంది. ఈ కార్యక్రమంలో అనురాగ్ యూనివర్సిటీ తరపున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ (ఏఐఎంఎల్) విభాగాధిపతి డాక్టర్ ఎ. మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు.
ఈ ఒప్పందం ద్వారా ఇరు విశ్వవిద్యాలయాల మధ్య సంయుక్త పరిశోధనలు, అధ్యాపకులు, విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలు, అంతర్జాతీయ విద్యా సహకారం, గ్లోబల్ లెర్నింగ్ అవకాశాలు మరింత విస్తరించనున్నాయి.
అంతర్జాతీయ విద్యా సంస్థలతో భాగస్వామ్యాలను పెంపొందిస్తూ, విద్యార్థులు, అధ్యాపకులకు ప్రపంచస్థాయి విద్యా, పరిశోధనా అవకాశాలను అందించేందుకు అనురాగ్ యూనివర్సిటీ చేస్తున్న కృషిలో ఈ ఒప్పందం ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలుస్తుందని విశ్వవిద్యాలయ ప్రతినిధులు తెలిపారు.