ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా పుట్ట లక్ష్మణ్
మేడిపల్లి, అక్టోబర్ 2 (విజయక్రాంతి): అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) రాష్ట్ర కార్యదర్శిగా, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా, బోడుప్పల్ సర్కిల్, పీర్జాదిగూడ డివిజన్ కి చెందిన పుట్ట లక్ష్మణ్(Putta Laxman)ని మరోసారి ఎన్నుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయని, ఈ వార్షికోత్సవాల్లో విద్యారంగ సమస్యలపై చర్చించి, భవిష్యత్ కార్యచరణ రూపొందించుకున్నామని, దేశంలో, రాష్ట్రంలో పాలకులు విద్యారంగాన్ని విస్మరిస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, విద్యకు బడ్జెట్లో అధిక నిధులు కేటాయించకుండా, విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి నియమించకుండా సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖను పెట్టుకొని విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తు, ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ప్రభుత్వ విద్య బలోపేతం కోసం పోరాటాలు నిర్వహిస్తామని పుట్ట లక్ష్మణ్ తెలిపారు.