మండలంలో వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు
ఎస్ఐ మధు
డీజేలకు అనుమతి లేదు
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),సెప్టెంబర్ 22: అర్వపల్లి పోలీస్ స్టేషన్(Arvapally Police Station) పరిధిలో నేడు,రేపు అనగా 23, 24 తేదీలలో జరగనున్న వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తగిన భద్రతా చర్యలు చేపట్టడం జరిగిందని అర్వపల్లి ఎస్ఐ పి మధు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు, నిర్వాహకులు పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని, డీజేలకు ఎట్టి పరిస్థితిలో అనుమతి లేదని, నిమజ్జన ఊరేగింపులో అధిక శబ్దంతో సౌండ్ సిస్టం వాడరాదని, విగ్రహాలను తరలించే వాహనాలపై అధిక సంఖ్యలో భక్తులు ఎక్కరాదని,డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపరాదని పలు సూచనలు చేశారు.శాంతియుత వాతావరణంలో వినాయక చవితి నిమజ్జనం వేడుకలు నిర్వహించుకునేందుకు ప్రతీఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.