శ్రీ వరసిద్ది వినాయక దేవాలయ కమిటీ గణేష్ మండపం వద్ద మహా అన్నదానం

22-09-2026 | 11:25pm

ప్రారంభించిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎర్నేని కుసుమ బాబు

కోదాడ సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): కోదాడ పట్టణం(Kodad town)లోని భవానీనగర్‌లో శ్రీ వరసిద్ది వినాయక దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ మండపం వద్ద మంగళవారం మహా అన్నదానం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు(Municipal Chairperson Erneni Kusuma Venkataratnam Babu) ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం భక్తులు, స్థానికులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ.. అన్నదానం మహోన్నతమైన సేవా కార్యక్రమమని, ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించడం ద్వారా మానవత్వాన్ని చాటుకోవచ్చని పేర్కొన్నారు. సేవా కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. భక్తి కార్యక్రమాలతోపాటు ప్రజోపయోగ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడం అభినందనీయమని తెలిపారు.భవానీనగర్‌లో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమానికి స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వచ్చిన ప్రతి ఒక్కరికీ అన్నప్రసాదాన్ని అందించారు. దీంతో భవానీనగర్‌ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ప్రజలందరినీ ఒకచోట చేర్చి అన్నదానం నిర్వహించడం ద్వారా సేవాభావాన్ని చాటారని పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించి సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో  మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దేవరపల్లి మల్లేశ్వరి, డిసిసిబి మాజీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, స్థానిక కౌన్సిలర్ కొల్లా కోటిరెడ్డి, దేవాలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ముండ్రా రామారావు, ధరావత్ హాజీ నాయక్, చెరుకూరి  ప్రభాకర్ రావు, ఇర్ల రోజా రమణి నారాయణరెడ్డి, సహాయ కార్యదర్శి బాడిశ రామారావు, విగ్రదాత తుములూరి సీతారామరాజు, వెంకటరెడ్డి నాగేశ్వరరావు సుదర్శన్ రెడ్డి, జెట్టి రామిరెడ్డి ,బ్రహ్మారెడ్డి, టి నాగేశ్వరరావు మహేశ్వర్ రెడ్డి లచ్చిరెడ్డి, డి సి వెంకటరెడ్డి ,నరేష్ తదితరులు పాల్గొన్నారుc

మరిన్ని వార్తలు