ఇన్ స్పెక్టర్ కిరణ్ ను కలిసిన బిఆర్ఎస్ నాయకులు
ఘట్ కేసర్, అక్టోబర్ 24 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ మున్సిపల్(Ghatkesar Municipality) బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఘట్కేసర్ ఇన్ స్పెక్టర్(Ghatkesar Inspector) గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన కిరణ్(Kiran) ని శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈకార్యక్రమంలో మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవ రెడ్డి, రైతు సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ సార శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపిటిసి మేకల నర్సింగ్ రావు, మాజీ కౌన్సిలర్లు చందుపట్ల వెంకటరెడ్డి, బేతాళ నర్సింగ్ రావు, బండారి ఆంజనేయులు గౌడ్, నాయకులు బొక్క విష్ణువర్ధన్ రెడ్డి, వరికుప్పల లింగస్వామి, మందాడి శ్రీనివాస్ రెడ్డి, బొంత సుధాకర్, కందకట్ల సుదర్శన్ రెడ్డి, పల్లె విజయ్ గౌడ్, ఎర్రోళ్ల సత్యనారాయణ, రొడ్డ యాదగిరి, బిజిలి సదానందం, లక్ష్మయ్య, ఎండి సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.