పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

24-10-2026 | 07:55pm

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి విజయానికి కృషి చేయాలి

భద్రాద్రి కొత్తగూడెం ,( విజయక్రాంతి) : ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల(Graduate MLC elections) నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు(Graduate Voter Registration) కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని కాంగ్రెస్ నాయకులు పిలుపు నిచ్చారు. శనివారం పాల్వంచ పట్టణంలోని 2వ డివిజన్ కార్పొరేటర్ భవిత కిరణ్ మాలంపాటి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా డీసీఎంఎస్ మాజీ చైర్మన్, రాష్ట్ర మార్క్‌ఫెడ్ మాజీ డైరెక్టర్, పాల్వంచ సొసైటీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, మాజీ పాల్వంచ మండల అధ్యక్షుడు కొండం వెంకన్న పాల్గొన్నారు.

ఈ సందర్భంగా 34, 35, 37 బూత్‌ల బూత్‌ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) ముద్రబోయిన శ్రీనివాసరావు, భూక్య ఝాన్సీ, మిరియాల నాగరాజులకు పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై పలు విలువైన సలహాలు, సూచనలు అందించారు. అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా కృషి చేయాలని సూచించారు.

రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి విజయానికి పాల్వంచ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీ సాధించేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ కార్పొరేటర్ భవిత కిరణ్ మాలంపాటి, కొత్వాల శ్రీనివాసరావు, కొండం వెంకన్న, కాంగ్రెస్ నాయకులు మాలంపాటి కిరణ్ కుమార్, తిప్పిరెడ్డి మధుసూదన్ రెడ్డి, నల్లమోతు పవన్ కుమార్, కాకటి స్వామి, సతీష్, గల్లా రాహుల్ తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు