5 September, 2026 | 1:08 AM

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు.. శోభాయాత్ర

05-09-2026 | 12:26am

ముకరంపుర,(విజయక్రాంతి): నగరంలోని సాయినగర్‌లో వెలసిన  మురళీ కృష్ణ మందిరంలో ‘సుందర్ సత్సంగ్’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం నిర్వహించిన శ్రీకృష్ణ, రాధ, గోపికల వేషధారణలో చిన్నారుల శోభాయాత్ర భక్తులను ఆకట్టుకుంది.ఈ శోభాయాత్రకు కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చిన్నారుల వేషధారణను తిలకించి వారిని అభినందించారు.

ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ... శ్రీకృష్ణ పరమాత్మ బోధనలు నేటి సమాజానికి ఎంతో ఆదర్శనీయమని అన్నారు. ధర్మం, సత్యం, కర్తవ్యనిష్ఠ, మానవతా విలువలను శ్రీకృష్ణుడు తన బోధనల ద్వారా ప్రపంచానికి చాటిచెప్పారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు బొడ్ల కృష్ణ, కార్యదర్శి ఇ. సురేందర్ రావు, కోశాధికారి రాచర్ల వసంతం, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రముఖులు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు