రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు మోడల్ స్కూల్ విద్యార్థిని
కొడిమ్యాల,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా(Jagtial District) కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్(Kodimyal Model School)- జూనియర్ కళాశాల విద్యార్థిని తూడి లాస్య రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ అండర్ 19 వాలీబాల్ పోటీల(Volleyball Tournament)కు ఎంపికైనట్లు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ బి.లావణ్య తెలిపారు. అక్టోబర్ 9 న మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల లో జరిగే రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ వాలీబాల్ అండర్ 19 టోర్నమెంట్లో ఈ క్రీడాకారిని పాల్గొననున్నారు. విద్యార్థినినీ ఉమ్మడి జిల్లా ఎస్ జి ఎఫ్ అండర్ 19 సెక్రటరీ బన్సీలాల్,పిడి అనూప్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు జీవన్ రెడ్డి, ఉపసర్పంచ్ నర్సయ్య,సీనియర్ కోచ్ క్రీడాకారులు ఎంద్రికాయల శ్రీనివాస్,రాజు,మల్లేశం, అనిల్, మోడల్ స్కూల్ ఉపాధ్యాయ బృందం అభినందించారు.