కఠిన సేవా పతకం అందుకున్న అజయ్‌కు అభినందనలు

08-10-2026 | 11:23pm

టేకులపల్లి,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri kothagudem district)లో విధి నిర్వహణలో చూపిన ధైర్యం, అంకితభావం, క్రమశిక్షణ, సేవా నిబద్ధతకు గుర్తింపుగా టేకులపల్లి(Tekulapally) మండల కేంద్రానికి చెందిన పోలీసు సిబ్బంది చిర్ర అజయ్‌ కఠిన సేవా పతకాన్ని అందుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్(SP Rohit Raj) చేతుల మీదుగా ఆయన ఈ పతకాన్ని స్వీకరించారు. కఠిన పరిస్థితుల్లోనూ విధి నిర్వహణలో వెనకడుగు వేయకుండా సేవలందించినందుకు ఈ పురస్కారం లభించడం పట్ల మిత్రులు, సహచరులు అభినందనలు తెలిపారు. అజయ్‌ సేవలకు ఈ పతకం గుర్తింపుగా నిలుస్తుందని, భవిష్యత్తులో మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు