ప్రగతి పదంలో... జవహర్ నగర్ లోని కాలనీలు

05-10-2026 | 09:53pm

మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్

జవహర్ నగర్,(విజయక్రాంతి): కాలనీల అభివృద్ధియే దేశాభివృద్ధి అని కాలనీలు అభివృద్ధి చెందితేనే ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తద్వారా ఊరు చివరికి దేశాలే అభివృద్ధి చెందుతాయని జవహర్ నగర్ మాజీ మేయర్ శాంతి కొటేష్ గౌడ్(Former Mayor Shanthi Kotesh Goud) పేర్కొన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(Malkajgiri Municipal Corporation) పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ డివిజన్ పరిధిలోని బజరంగ్ కాలనీలో 34 లక్షల రూపాయలతో 430 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణ పనులను మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్ సోమవారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.

ఈ సందర్భంగా శాంతి కొటేష్ గౌడ్ మాట్లాడుతూ అభివృద్ధి పదంలో జవహర్ నగర్ కాలనీలు దూసుకెళ్తున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చెందడం ముదా బావమన్నారు. జిల్లా అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ సహకారంతో జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకుల సహకారంతో జవహర్ నగర్ సర్వతో ముకాభివృద్ధిని సాధిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బల్లి శ్రీనివాస్ గుప్తా, మాజీ కోఆప్షన్ సభ్యులు శ్వేతా ముఖేష్, శోభా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మనోధర్ రెడ్డి, బజరంగ్ కాలనీ అధ్యక్షులు ఇంద్రసేనారావు, రాజేష్, గడ్డం శ్రీనివాస్, ఉపేందర్, బాలరాజ్, నరేష్, కృష్ణ, సుబ్బారావు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు