మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే
తల్లిదండ్రుల ఆశయాల సాధనకు కృషి: ప్రిన్సిపల్ బండి రాజు
మల్కాజిగిరి,(విజయక్రాంతి): మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల(Malkajgiri Government Degree College)లో గురువారం ఫ్రెషర్స్ డే కార్యక్రమం(Freshers Day program) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య బండి రాజు మాట్లాడుతూ.. విద్యార్థుల తల్లిదండ్రులు కన్న కలలను నెరవేర్చేలా కళాశాల కృషి చేస్తుందని అన్నారు. విద్యార్థులు(Students) విద్యతో పాటు తమలోని ప్రతిభకనుగుణంగా ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. కళాశాలలో లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నూతన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ పాటలు, నృత్యాలు, ప్రసంగాలతో అలరించారు. పలువురు విద్యార్థులు ప్రసంగాల ద్వారా తమ ఆలోచనలు, అభిప్రా యాలను పంచుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమా లతో కళాశాల ప్రాంగణం సందడిగా మారింది. విద్యార్థులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శిం చారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది పాల్గొని విద్యార్థులను అభినందించారు.