భక్తిశ్రద్ధలతో మహా అన్నదానం

23-11-2026 | 08:17pm
  1. అయ్యప్ప స్వాముల సేవలో రమేష్ నాయుడు బ్రదర్స్
  2. అన్నదానానికి రూ.10 వేల విరాళం అందించిన మామిడి బాలకృష్ణ,మాధవి దంపతులు

కోదాడ నవంబర్ 23(విజయక్రాంతి): పట్టణంలోని విజయనగర్ బైపాస్ మెయిన్ రోడ్డులో అయ్యప్ప దేవాలయం(Ayyappa Temple) సమీపంలో రమేష్ నాయుడు బ్రదర్స్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం భక్తులకు సేవాభావాన్ని చాటుతోంది. ఇందులో భాగంగా సోమవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా దాతలు మామిడి బాలకృష్ణ, ఆయన భార్య మాధవి దంపతులు అన్నదాన కార్యక్రమానికి రూ.10 వేల విరాళాన్ని అందజేశారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొని అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ గురుస్వామి శ్రీనివాస్ నాయుడు, బర్మవత్ సీతారాం సింగ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు