ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా బండ్లగూడ కిశోర్ గౌడ్

24-10-2026 | 06:42pm

ఘట్ కేసర్, అక్టోబర్ 24 (విజయక్రాంతి) : భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా(OBC Morcha) మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులుగా బండ్లగూడ కిషోర్ గౌడ్ నియమితులయ్యారు. కిషోర్ గౌడ్ నియామకాన్ని ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఎర్రదల మహేందర్ యాదవ్ ప్రకటించగా నియామక పత్రాన్ని బిజెపి జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ శనివారం అందజేశారు.

ఈ సందర్భంగా కిషోర్ గౌడ్(Kishore Goud) మాట్లాడుతూ పార్టీ అధిష్టానం నాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ పటిష్టతకు తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు మహేందర్ యాదవ్ తో పాటు నాకు పదవి రావడానికి సహకరించిన బిజెపి జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, పార్టీ నియోజకవర్గం ఇన్చార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి, జిల్లా మీడియా కన్వీనర్ చలువాది ప్రవీణ్ రావు, ఘట్కేసర్ డివిజన్ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు