కేపీఆర్‌ఐటీలో ఘనంగా టెక్ ఫెస్ట్–2026 నిర్వహణ
విద్యార్థుల సాంకేతిక ప్రతిభకు వేదికగా రెండు రోజుల సాంకేతిక ఉత్సవం
ఘట్‌కేసర్, అక్టోబర్ 13 (విజయక్రాంతి) : ఘనపూర్ లోని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో కేపీఆర్‌ఐటీ, కేపీఆర్‌ఐటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్(KPRIT College of Engineering) సంయుక్తంగా ఈనెల 12, 13 తేదీల్లో నిర్వహించిన టెక్ ఫెస్ట్–2026 సాంకేతిక ఉత్సవం విద్యార్థుల సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలు, వినూత్న ఆవిష్కరణలకు వేదికగా నిలిచింది.
ఈరెండు రోజుల సాంకేతిక ఉత్సవంలో సాఫ్ట్‌వేర్ హ్యాకథాన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, ఫార్వర్డ్ డిప్లాయ్డ్ ఇంజినీర్, పేపర్ ప్రజెంటేషన్, ప్రాజెక్ట్ కాంటెస్ట్, కోడింగ్ కాంటెస్ట్, ఐఓటీ వర్క్‌షాప్, ప్రాంప్ట్ ఇంజినీరింగ్, పవర్ బీఐ అండ్ టేబ్లూ, పబ్లిక్ స్పీకింగ్, స్కెచ్‌అప్–3డీ మోడలింగ్ అండ్ డిజైన్, స్టార్టప్ ఐడియా పిచింగ్ వంటి పలు సాంకేతిక కార్యక్రమాలను నిర్వహించారు.
కేపీఆర్‌ఈఎస్ చైర్మన్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, వైస్ చైర్మన్ శ్రీ కొమ్మూరి ప్రశాంత్, డైరెక్టర్ – స్ట్రాటజీ కొమ్మూరి దివ్య శ్రీ, సీఈఓ ప్రొఫెసర్ డాక్టర్ సి.డి. నాయుడు గారి ఆశీస్సులతో ఈ సాంకేతిక ఉత్సవాన్ని నిర్వహించారు. కేపీఆర్‌ఐటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శ్రీనాథ్ కశ్యప్, కేపీఆర్‌ఐటీ వైస్ ప్రిన్సిపాల్ వై. విశ్వశ్రీ మార్గదర్శకత్వంలో కార్యక్రమాలను నిర్వహించారు.
ఈకార్యక్రమంలో కార్పొరేట్ రిలేషన్స్ డీన్ అనీష్ శ్రీవాస్తవ, కేపీఆర్‌ఈఎస్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జి. నాగరాజు, అకడమిక్స్ డీన్ డాక్టర్ సి. రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.