నూతన సీఐ కిరణ్ కు కాంగ్రెస్ నాయకుల శుభాకాంక్షలు
ఘట్ కేసర్, అక్టోబర్ 23 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ ఇన్ స్పెక్టర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన పి. కిరణ్ ని ఘట్ కేసర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ(Ghatkesar Division Congress Party) అధ్యక్షులు బొక్క ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఘట్ కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్యయాదవ్,
గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ సభ్యులు సిహెచ్. మచ్చేందర్ రెడ్డి, మాజీ పిసిసి కార్యదర్శి కట్ట జనార్ధన్ రెడ్డి, కీసర గుట్ట ట్రస్ట్ బోర్డు సభ్యులు సగ్గు అనీత, మాజీ సర్పంచ్ మేడబోయిన వెంకటేష్, డివిజన్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శులు మహమ్మద్ అబ్దుల్ ఖయ్యూం, మొల్గురం రామస్వామి, కందకట్ల మాధవరెడ్డి, అధికార ప్రతినిధి కొత్తకొండ వెంకటేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవరెడ్డి, సీనియర్ నాయకులు కొంతం అంజిరెడ్డి,
సగ్గు శ్రీనివాస్, కడపోల్ల మల్లేష్, బర్ల దేవేందర్ ముదిరాజ్, ఉల్లి ఆంజనేయులుయాదవ్, రెహమాన్, బొక్క సత్తిరెడ్డి, సెక్రటరీలు మేకల సునీల్ కుమార్, కడపోల్ల రాజు, మైనారిటీ ప్రెసిడెంట్ ఫరూఖ్ భాయ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు తోక మల్లేష్, మహిళా అధ్యక్షురాలు అనుజ నాయక్, రజిత నాయక్, తదితరులు పాల్గొన్నారు.