అనురాగ్ విద్యార్థినికి డాక్టరేట్ ప్రధానం

26-10-2026 | 11:07pm

ఘట్ కేసర్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): అనురాగ్ విశ్వవిద్యాలయం(Anurag University) ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థిని ఎం. ప్రేమలత అప్టిమైజడ్ ఐఓటీ డివైస్ అంతేంటికేషన్ మెథడాలజీ ఫర్ సెక్యూర్ డేటా ట్రాన్స్ఫర్ అనే అంశంపై పరిశోధన నిర్వహించి, మార్గదర్శకులు డాక్టర్ డి. నరేందర్ సింగ్ పర్యవేక్షణలో తన పరిశోధనను పూర్తి చేశారు.

ఈపరిశోధనకు సంబంధించిన వైవా వోస్ పరీక్ష 2026, అక్టోబర్ 12వ తేదీన నిర్వహించగా, ఈ పరీక్షకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కురుక్షేత్ర, ఈసీఈ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పూనమ్ జిందాల్ బాహ్య పరీక్షకురాలుగా పాల్గొన్నారు.

అనురాగ్ విశ్వవిద్యాలయ పరీక్షల విభాగ డీన్ ప్రొఫెసర్ ముత్తారెడ్డి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ వైవా వోస్ పరీక్షలో, ఆర్ అండ్ డి డీన్ డాక్టర్ సతీష్ కుమారన్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్  సికిందర్ బాబా, ఈసిఈ విభాగ అధిపతి డాక్టర్ హరికృష్ణ కమతం ఇతర విభాగాల అధిపతులు ప్రొఫెసర్ల సమక్షంలో ఎం. ప్రేమలత తన పరిశోధనను విజయవంతంగా వివరించి సమర్పించారు. పరీక్షకుల కమిటీ సిఫారసుల ఆధారంగా ఎం. ప్రేమలత కి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పిహెచ్.డి) పట్టా ప్రదానం చేయబడింది.

మరిన్ని వార్తలు