సురేఖారెడ్డికి గురువందనం.!

02-10-2026 | 11:01pm

- రాష్ట్రస్థాయి ఉత్తమ టీచర్ ఎడ్యుకేటర్ అవార్డు. 

నాగర్‌కర్నూల్‌, అక్టోబర్‌ 2 (విజయక్రాంతి): హైదరాబాద్‌ రవీంద్రభారతిలో టీచర్‌ప్లస్‌ ఈ-లెర్నింగ్‌ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గురు వందనం–స్టేట్ బెస్ట్ టీచర్ ఎడ్యుకేటర్ అవార్డు–2026’ కార్యక్రమంలో శుక్రవారం నాగర్‌కర్నూల్‌ మోడ్రన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ సీనియర్‌ అధ్యాపకురాలు సి. సురేఖారెడ్డి(Surekha Reddy)కి రాష్ట్రస్థాయి ఉత్తమ టీచర్‌ ఎడ్యుకేటర్‌ అవార్డు అందజేశారు. ఉపాధ్యాయ విద్యారంగంలో ఆమె అందించిన సేవలు, విద్యాపరమైన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. ఈ గౌరవం తన బాధ్యతను మరింత పెంచిందని సురేఖారెడ్డి తెలిపారు. అవార్డును విద్యార్థులు, సహచర అధ్యాపకులు, కళాశాల యాజమాన్యానికి అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు. సురేఖారెడ్డిని కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, రెడ్డి సేవా సమితి నాయకులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు అభినందించారు.

మరిన్ని వార్తలు