నిధులు దుర్వినియోగం అయ్యాయని కలెక్టర్ కు ఫిర్యాదు..

23-11-2026 | 08:08pm

తాడ్వాయి, నవంబర్ 23 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలం సంగోజి వాడి గ్రామపంచాయతీలో నిధులు దుర్వినియోగం అయ్యాయని సోమవారం గ్రామస్తులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. గ్రామ సర్పంచ్ తాజోద్దీన్ కల్లు దుకాణం వారి నుంచి రూ.30 వేలు తీసుకొని తన సొంత అవసరాలకు వాడుకున్నారని ఆరోపించారు. గత మూడు నెలల నుంచి ఆయన డబ్బులను తన వద్ద ఉంచుకున్నారని వారు పేర్కొన్నారు.

ట్రెజరీలో జమ చేయకుండా డబ్బులు ఎందుకు వాడుకున్నావని గ్రామసభలో సర్పంచును ప్రశ్నించగా డబ్బులు తన వద్దే ఉన్నాయని సర్పంచ్ ఒప్పుకున్నాడని వారు ఫిర్యాదులో తెలిపారు. ఈ విషయమై సర్పంచ్ తాజోద్దీన్ ను విజయ క్రాంతి వివరణ కోరగా తాను కల్లు దుకాణంకు సంబంధించిన టాక్స్ లు పెండింగ్ లో ఉండేనని తాను స్వయంగా వెళ్లి రూ.30 వేలు వసూలు చేశానని తెలిపారు.ఈ డబ్బులను ఈ నెల 19న బ్యాంకులో జమ చేసినట్లు ఆయన వివరించారు. తాను గ్రామపంచాయతీకి సంబంధించిన ఒక్క రూపాయి వాడుకోలేదని తెలిపారు. ఈ విషయం గ్రామస్తులకు తెలిపిన పట్టించుకోకుండా ఫిర్యాదు చేశారని వివరించారు. ఫిర్యాదు చేసిన వారిలో గ్రామ మాజీ ఉప సర్పంచ్ గైని శివాజీ, నాయకులు బాలరాజు,పారూక్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు