టీజేఎస్ పార్టీ పటిష్టతకు నాయకులు కంకణ బద్దులు కావాలి

04-10-2026 | 05:36pm

జిల్లా ఇంచార్జ్ పల్లె వినయ్

ఘట్ కేసర్, అక్టోబర్ 4 (విజయక్రాంతి) : తెలంగాణ జన సమితి పార్టీ(Telangana Jana Samithi Party) పటిష్టతకు పార్టీ నాయకులు కంకణ బద్దులు కావలసిన అవసరం ఉన్నదని పార్టీ మేడ్చల్ జిల్లా ఇన్చార్జ్ పల్లె వినయ్(Party Medchal District In-charge Palle Vinay) అన్నారు. ఘట్ కేసర్ పట్టణంలో(Ghatkesar town) ఆదివారం తెలంగాణ జన సమితి మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ నూతన కార్యాలయంను పార్టీ ఇంచార్జ్ వినయ్ ప్రారంభించడం జరిగింది. అనంతరం జరిగిన జిల్లా పార్టీ సమావేశంలో నూతనంగా చేరికలు జరిగాయి.

జిల్లా ఇంచార్జ్ పల్లె వినయ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల సమయానికి టీజేఎస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి నాయకులు కృషి చేయాలన్నారు. పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మారం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో జన సమితి పార్టీ నుండి అభ్యర్థులను నిలబెట్టి పార్టీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. టీజేఎస్ వ్యవస్థాపకులు, ఎమ్మెల్సీ కోదండరాం ఆశయ సాధనకు కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నూతనంగా పార్టీ పదవులు పొందిన ఘట్కేసర్ డివిజన్  అధ్యక్షునిగా ప్రమోద్ గుప్తా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏర్పుల దయాకర్, ఉపాధ్యక్షులుగా రెడ్డిపల్లి శ్రీనివాస్, వెంకటచారి, ట్రెజరర్ సుమంత్ రెడ్డి, అధికార ప్రతినిధి ప్రవీణ్ ఆర్య, మహిళా అధ్యక్షురాలు సుకన్య గౌడ్ లకు నియామకపు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అశోక్ రెడ్డి, జిల్లా నాయకులు రాజు ముదిరాజ్, జె. రవికుమార్, జి. లక్ష్మణ్, యాదగిరి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, జుబేర్, బి. కృష్ణారెడ్డి, రాజ్ కుమార్, నరసింహ, మాణిక్యం, సురేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు