న్యాయం దక్కేనా?

21-09-2026 | 05:30am
  1. విల్లాలపై రుణం తీసుకున్నారని బాధితులు గతంలో ఫిర్యాదు 
  2. ఏకపక్షంగా విచారణ జరిపి కేసు మూసివేసిన పోలీసులు 
  3. కేసు విచారణ తీరుపై బాధితుల అనుమానాలు 

మేడ్చల్, సెప్టెంబర్ 21(విజయ క్రాంతి): సాకేత్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్(Saketh Engineers Private Limited) యజమానులకు తెలియకుండా వారి విల్లాలు, ప్లాట్ల(Villas, plots)ను అక్రమంగా తాకట్టు పెట్టి రూ. 80 కోట్లు రుణం పొందిన కేసును పోలీసులు  ఏకపక్షంగా మూసివేశారు. మేడ్చల్ మండ లం గౌడవెల్లి శివారు(Outskirts of Gowdavelli)లో సాకేత్ ఇంజనీర్స్ విల్లాలు, ఫ్లాట్లు నిర్మించి విక్రయించింది. విల్లా లు, ఫ్లాట్లు విక్రయించిన తర్వాత వాటిపై మళ్లీ రుణం పొందింది. తమకు జరిగిన మో సంపై బాధితులు మేడ్చల్ పోలీస్ స్టేషన్లో(Medchal Police Station) ఫిర్యాదు చేయగా, సాకేత్ ఇంజనీర్స్ కు అ నుకూలంగా కేసును మూసివేశారు.

పోలీసుల తీరుపై బాధితులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక పోలీసుల విచారణ తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ విల్లాలు ప్లాట్ల మీద సాకేత్ ఇంజనీర్స్ అక్రమంగా రుణం పొందినట్లు అన్ని రకాల డాక్యుమెంట్స్ సమర్పించామని, అయినప్పటికీ పోలీసులు ఏకపక్షంగా విచారణ చేశార ని బాధితులు వాపోతున్నారు. రిజిస్టర్ సెల్ డీడ్, ఈసీ, సబ్ రిజిస్టార్ ఆఫీస్ రికార్డులు, రేరా పత్రాలు, ఆర్ ఓ సి ఫైలింగ్స్ వంటి పూర్తి ఆధారాలు సమర్పించినప్పటికీ విచారణ అధికారి బిల్డర్ కు అనుకూలంగా ‘వాస్తవంలో పొరపాటు’ అని కేసు మూసివేశారు. 

రుణం కోసం ప్రయత్నించగా వెలుగులోకి 

ఒక కొనుగోలు దారుడు విల్లాపై రుణం తీసుకోవడానికి ప్రయత్నించగా సాకేత్ ఇంజనీర్స్ వాటిని తాకట్టు పెట్టినట్టు తేలింది. ఒక యజమాని గతంలో బ్యాంకు రుణం తీసుకొని మొత్తం చెల్లించాడు. మళ్లీ రుణం కోసం ప్రయత్నించగా తనఖా లో ఉన్నట్లు తేలింది. దీంతో మిగతావారు కూడా ఈసీ కోసం దరఖాస్తు చేయగా తనఖ లో ఉన్నట్లు వచ్చింది. మొత్తం రూ. 80 కోట్లు సాకేత్ ఇంజనీర్స్ రు ణం పొందినట్లు తేలింది. దీంతో బాధితులు మే ఒకటవ తేదీన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దృష్టికి తీసుకెళ్లారు. రెం డవ తేదీన మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

పోలీసులు ఐదవ తేదీన ఎఫ్‌ఐఆర్ నమోదు(FIR registered) చేశారు. ఫిర్యాదు విషయాన్ని పో లీసులు సాకేత్ ఇంజనీర్స్ కు తెలియజేయడంతో వారు నాలుగవ తేదీనే వడ్డీతో కలిపి ఒకే రోజు రూ. 89 కోట్లు చెల్లించారు. పోలీసులు సాకేత్ ఇంజనీర్ కు అవకాశం ఇవ్వ డానికి ఎఫ్‌ఐఆర్ ఆలస్యంగా నమోదు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. రుణం చె ల్లించిన తర్వాత బాధితులతో సాకేత్ ఇంజనీర్స్ రాజీ చర్చలకు ప్రయత్నించింది. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందేనని బాధితులు ఫిర్యాదు వెనక్కి తీసుకోవడానికి అంగీకరించలేదు. 

నాడు అధికారులు... నేడు పోలీసులు 

విక్రయించిన విల్లాలపై రుణం పొందడానికి సాకేత్ ఇంజనీర్స్ కు అప్పట్లో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సహకరించారు. ప్రస్తుతం పోలీసు వ్యవస్థ కింది నుంచి పై స్థాయి వర కు సహకరించినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో తీవ్ర జాప్యం చేశారు. దీనిపై బాధితులు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ స్పందన కనిపించ లేదు.

చివరికి బిల్డర్ కు అనుకూలంగా వ్యవహరించడం బట్టి చూస్తే కిందిస్థా యి నుంచి పై స్థాయి వరకు సహకరించిన ట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ అధికారులు తన కా పత్రం రిజిస్ట్రేషన్ చేసే ముందు ఈసీ పరిశీలించాలి. అదేమీ చూడలేదు. తనకా దస్తవే జు, టైటిల్ డీడ్ ఇతర డాక్యుమెంట్లను సైతం ఉద్దేశపూర్వకంగా పరిశీలించలేదు. 2009 జిపిఏను పరిగణలోకి తీసుకొని అనుకూలంగా వ్యవహరించారు. 

న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం 

పోలీసుల విచారణలో తమకు న్యా యం జరుగుతుందని భావించాం. కానీ తమ అభిప్రాయాలను, డాక్యుమెంట్లను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా కేసును మూసివేశారు. ఈ విషయంలో తాము ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వేయబోము. న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం.

అనిత విటల్, బాధితురాలు 

మరిన్ని వార్తలు