నృత్యం చేయడానికి కాదు.. రాజ్యాన్ని ఏలడానికి..!

31-10-2026 | 05:00am

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ బయోపిక్ ‘ఈఠా’. లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) దర్శకత్వంలో మ్యాడాక్ ఫిలమ్స్ బ్యానర్‌పై దినేశ్ విజన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘స్త్రీ 2’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత శ్రద్ధా కపూర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్‌తో పాటు రణ్‌దీప్ హుడా, మహ్మద్ జీషన్ అయ్యూబ్, సిద్ధార్థ్ జాదవ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ సాంస్కృతిక జానపద కళాకారిణి, లావణీ నృత్యం, తమాషా కళా రంగానికి చెందిన లెజెండ్ విఠాబాయి నారాయణ్‌గావ్‌కర్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.

ఈఠా.. సమాజంలో ఎన్నో అవమానాలు, గుండెకోతలు, ద్రోహాలను ఎదుర్కొని, తన అద్భుతమైన కళ ద్వారా ఒక సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించిందనే సెంటిమెంట్, పవర్‌ఫుల్ అంశాలతో ఈ కథను తెరకెక్కించారు. ఇదే ఏడాది డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్ర అధికారిక ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. ట్రైలర్‌లో శ్రద్ధా కపూర్ సాంప్రదాయ మహారాష్ట్ర నౌవారి చీరకట్టులో అద్భుతమైన నృత్యాలు చేస్తూ, శక్తిమంతమైన సంభాషణలతో అదరగొట్టింది. ముఖ్యంగా ‘నాచ్ నహీ, రాజ్ కర్నే ఆ రహీ హై ఈఠా!’ (నృత్యం చేయడానికి కాదు, రాజ్యం ఏలడానికి వస్తోంది ఈఠా) అనే డైలాగ్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. సంగీత దర్శక ద్వయం అజయ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. 

మరిన్ని వార్తలు