‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ రెడీ
మళ్లీ మొదలుకానున్న దోస్తుల సందడి.. నవంబర్ 19న థియేటర్లలోకి!
టాలీవుడ్‌లో యూత్‌ను ఆకట్టుకున్న ‘ఈ నగరానికి ఏమైంది’(Ee Nagaraniki Emaindi) సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈఎన్ఈ రిపీట్(ENE Repeat) ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని 2026 నవంబర్ 19న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
తరుణ్ భాస్కర్(Tharun Bhascker) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ తెలుగు సినిమా సీక్వెల్ లో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కార్తీక్ పాత్రలో శ్రీనాథ్ మాగంటి కొత్తగా జట్టులో చేరారు. స్నేహం, సరదా, యూత్‌ఫుల్ కామెడీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మొదటి సినిమా అభిమానుల్లో ఇప్పటికీ క్రేజ్‌ను కొనసాగిస్తోంది. దీంతో ఈఎన్ఈ రిపీట్ రిలీజ్ తేదీ (ENE Repeat Release Date), కొత్త కథలో దోస్తుల గ్యాంగ్ చేసే సందడి ఎలా ఉండబోతోందన్న ఆసక్తి టాలీవుడ్‌లో నెలకొంది.