కార్తి కొత్త సినిమా.. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

24-09-2026 | 12:32pm

కార్తి-మోహన్ రాజా కాంబినేషన్‌లో కొత్త సినిమా రూపుదిద్దుకోనుంది. ప్రిన్స్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను ఆగస్టులో అధికారికంగా ప్రకటించారు. దర్శకుడిగా మోహన్ రాజాకు ఇది 25వ సంవత్సరం కాగా.. కార్తితో ఆయనకు ఇదే తొలి సినిమా.

MUST READ : శోకసంద్రంలో టాలీవుడ్

ఈ సినిమా కథ, పాత్రలకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ ఇంకా వెల్లడించలేదు. అయితే దర్శకుడు మోహన్ రాజా తాజాగా ఇచ్చిన వివరాల ప్రకారం.. తన గత చిత్రాలు ‘తని ఒరువన్’, ‘ఎమ్. కుమరన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి’లోని కొన్ని అంశాల కలయికగా ఈ మూవీ ఉండనుంది. అంటే యాక్షన్, ఇన్వెస్టిగేషన్ అంశాలతో పాటు కుటుంబ భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యం ఉండే అవకాశముంది.

కార్తి గతంలో పలు కమర్షియల్, ఫ్యామిలీ, యాక్షన్ కథల్లో నటించి మెప్పించాడు. మరోవైపు మోహన్ రాజా తన సినిమాల్లో ఎమోషన్‌కు కమర్షియల్ అంశాలను జోడించే శైలికి గుర్తింపు పొందాడు. ఈ ఇద్దరి కాంబినేషన్‌పై ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక బృందం, టైటిల్ వంటి వివరాలను మేకర్స్ వెల్లడించాల్సి ఉంది. షూటింగ్‌ను 2026 డిసెంబర్ లేదా 2027 జనవరిలో ప్రారంభించే అవకాశం ఉందని మోహన్ రాజా తెలిపారు.

MUST READ : ‘ది పారడైజ్’లో ప్రియదర్శి.. ఈ పాత్రపై ఎందుకింత చర్చ?

కాగా, కార్తి ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఆయన లైనప్‌లో ‘సర్దార్ 2’, ‘మార్షల్’ తో పాటు దర్శకుడు కళ్యాణ్ శంకర్‌తో మరో సినిమా కూడా ఉంది. 

మరిన్ని వార్తలు