అప్పుడు షో కూడా లేదు.. ఇప్పుడు ఫ్యాన్స్ క్యూ!

23-09-2026 | 06:41pm

హీరో నాని సినిమా విడుదలకు మరికొన్ని గంటలే ఉన్న వేళ ఆయన భార్య అంజు(Anju) చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నాని సినీ ప్రయాణంలోని తొలి రోజులను గుర్తుచేసుకుంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

2009లో నాని న్యూ కమర్‌గా ఉన్న సమయంలో ఆయన సినిమాకు కనీసం మార్నింగ్ షో కూడా ఉండేది కాదని అంజు పేర్కొన్నారు. అలాంటిది ఇప్పుడు అదే హీరో సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండటం చూస్తుంటే.. ఈ 17 ఏళ్లలో నాని ఎంత కష్టపడ్డాడో అర్థమవుతోందంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

ఇదిలా ఉంటే.. అంజు తన కుమారుడు జున్నుతో కలిసి నానికి మసాజ్ చేస్తున్న సరదా వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోతో పాటు ఆమె చేసిన ఎమోషనల్ పోస్ట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నాని సినీ ప్రయాణంలో ఎదురైన ఒడిదుడుకులను గుర్తుచేస్తూ అంజు చేసిన ఈ పోస్ట్.. ఆయన అభిమానుల్లో మరింత భావోద్వేగాన్ని నింపుతోంది.

మరిన్ని వార్తలు