జనస్థాన్ రాజకుమారి వచ్చింది!

31-10-2026 | 05:05am

నినితేశ్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా తెరకెక్కిస్తున్న చిత్రం ‘రామాయణం(Ramayanam)’. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్‌ఈజీ, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతమ్మగా సాయిపల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే, శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం నుంచి శూర్పణఖ పాత్రలో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘జనస్థాన్ కీ రాజకుమారి.. శూర్పణఖ’ అంటూ పరిచయం చేసిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ ఎపిక్‌లో ఫస్ట్ పార్ట్ ఈ నవంబర్ 5న హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమాను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఎస్వీసీ రిలీజ్ చేయనుంది. 

మరిన్ని వార్తలు