ఆమె షాకింగ్ డెసిషన్..ఎందుకో తెలుసా?
నటి వరలక్ష్మి శరత్ కుమార్(Varalaxmi Sarathkumar) చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్(Viral)గా మారాయి. ఇంతకీ ఆమె ఎందుకు పిల్లలు వద్దనుకుంటున్నారు? అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత నిర్ణయాన్ని వెల్లడించిన వరలక్ష్మి.. “నాకు పిల్లలు వద్దని నిర్ణయించుకున్నా.. నా భర్త కూడా ఇదే ఆలోచనతో ఉన్నారు” అని తెలిపారు. ఆయనకు తొలి వివాహం ద్వారా ఓ కుమార్తె ఉందని.. ఆమెను తన సొంత కూతురిలాగే చూసుకుంటానని చెప్పారు.
అంతేకాదు.. తమకు రెండు కుక్కపిల్లలు(Dogs) ఉన్నాయని, వాటినీ తన పిల్లల్లాగే భావిస్తానని తెలిపారు. పిల్లలను పెంచే బాధ్యతకు పూర్తిగా సిద్ధంగా లేకపోతే.. పిల్లలను కనకపోవడమే మంచిదంటూ వరలక్ష్మి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.