క్లీన్‌స్వీప్‌పై టీమిండియా కన్ను!
03-10-2026 | 09:25am
భారత్(India), వెస్టిండీస్(West Indies) మధ్య మూడో వన్డే మ్యాచ్ శనివారం జరగనుంది. న్యూ చండీగఢ్(New Chandigarh) వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు ఇరుజట్లు తలపడనున్నాయి. ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమిండియా.. 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. మరోవైపు భారత ఓపెనర్లు సెంచరీలతో అదరగొడుతుండటంతో బ్యాటింగ్ లైనప్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇవాళ్టి మ్యాచ్‌లో టీమ్ ఇండియా తుది జట్టులో కొన్ని మార్పులు(Changes) చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సిరీస్ గెలిచిన ఊపులో ఉన్న భారత్.. చివరి వన్డేలోనూ విజయం సాధించి క్లీన్‌స్వీప్(Clean Sweep)పై కన్నేసింది.