ముంబైలో కాక్రోజ్ ఫైట్
03-10-2026 | 07:34am
ముంబై: ముంబైలో సీజేపీ ఆందోళన రెండోరోజుకు చేరింది. కేంద్ర ఎన్నికల సంఘం(ECI) తీరును నిరసిస్తూ..సీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతూ..ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేష్ కుమార్(Gyanesh Kumar) రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై కూడా తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు.. ఎన్నికల సంఘం మాత్రం ఎస్‌ఐఆర్(SIR) ప్రక్రియపై తమ నిర్ణయాలను కమిషన్ ఏకగ్రీవంగా తీసుకుందని స్పష్టం చేసింది.ముంబైలో కొనసాగుతున్న ఈ ఆందోళనతో.. రాజకీయంగా మరోసారి ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై చర్చ మొదలైంది.