దేశ సమైక్యత, సమగ్రతల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

31-10-2026 | 10:55pm

అదనపు కలెక్టర్ రెవిన్యూ సిహెచ్ మహేందర్ జి

ములుగు,(విజయక్రాంతి): దేశ సమైక్యత, సమగ్రతల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని అదనపు కలెక్టర్ రెవిన్యూ సిహెచ్ మహేందర్ జి(Additional Collector C.H. Mahender G) అన్నారు. జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్(Sardar Vallabhbhai Patel) చిత్రపటానికి జిల్లా అదనపు  కలెక్టర్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

దేశాన్ని ఐకమత్యంగా ఉంచడంలో కృషిచేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యత దినోత్సవం(National Unity Day)గా నిర్వహించుకుంటున్నామని దేశానికి దిశ, నిర్దేశం చేసిన ఆయన చిరస్మరణీయూడని అన్నారు. అనంతరం దేశ ఐకమత్యం, సమగ్రత, భద్రతను కాపాడటానికి స్వయంగా అంకితమవుతానని, దేశ అంతర్గత భద్రతను పటిష్ట పరచడానికి స్వీయ తోడ్పాటు నందిస్తానని అదనపు కలెక్టర్ అధికారులు, ఉద్యోగుల చే రాష్ట్రీయ ఏక్తా దినోత్సవ ప్రతిజ్ఞను చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు