అన్నపూర్ణ మాతగా అమ్మవారి దివ్య దర్శనం

13-10-2026 | 07:59pm

వెంకటాపూర్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ధార్మిక భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో(Sridevi Sharannavaratri celebrations) భాగంగా మూడో రోజు అమ్మవారు అన్నపూర్ణ మాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు.

పూజా కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా అమ్మవారికి కూరగాయల అలంకరణ దాత గునిగంటి హరీష్ దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సాయంత్రం మహా అన్నప్రసాద కార్యక్రమానికి దాతలు పల్నాటి వీణ కోటి దంపతులు, లొటపెటల నారాయణ దంపతులు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. కార్యక్రమంలో వీరమల్లు, రాఘవేందర్, కరుణాకర్, గణేష్, రాజయ్య, కృష్ణ, అక్షయ, శ్రీధర్ రెడ్డి, భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు