శాంతి ఖని లో గైర్హాజరు కార్మికులకు కౌన్సిలింగ్
బెల్లంపల్లి: శాంతి ఖని లో గైర్హాజరు నివారణకు (Prevention of absenteeism)అధికారులు అవగనా కార్యక్రమాన్ని చేపట్టారు. నిర్దేశిత మాస్టర్ల కంటే తక్కువ ఉన్న ఉద్యోగులకు కు కౌన్సిలింగ్ ఇచ్చారు. సెప్టెంబర్ నెలలో అండర్ గ్రౌండ్ ఉద్యోగులైతే 16 మస్టర్లు కంటే తక్కువ, సర్ఫేస్ ఉద్యోగులకైతే 20 మస్టర్లు చేసిన వారికి, 100 మాస్టర్లు కంటే తక్కువ చేసిన వారికి గైర్హాజరు కౌన్సిలింగ్ ను నిర్వహించారు.
గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా, సంక్షేమ అధికారి ఈ. రవి కుమార్, POA, అబ్దుల్ రహీం సమక్షంలో గైర్హాజర్ కౌన్సిలింగ్ ను నిర్వహించారు. క్రమం తప్పకుండా విధులకు హాజరు కావాలని కోరారు. అధికారులు,యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.