రామప్ప శిల్పసంపదను తిలకించిన ఇస్రో శాస్త్రవేత్త
వెంకటాపూర్, అక్టోబర్ 2 (విజయక్రాంతి): మండలంలోని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చారిత్రక రామప్ప దేవాలయాన్ని శుక్రవారం ఇస్రో అడిషనల్ సెక్రటరీ(ISRO Additional Secretary), శాస్త్రవేత్త సుశీల్ కుమార్ శ్రీవాత్సవ(scientist Sushil Kumar Srivastav ) దంపతులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.
అనంతరం టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ రామప్ప ఆలయ చరిత్ర, కాకతీయుల కాలం నాటి శిల్పకళా వైభవం, ఆలయ విశిష్టతలను వారికి వివరించారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించిన బోటింగ్ చేశారు. వారి వెంట ఆలయ ఈవో ఇమ్మడి భాస్కర్, ఆర్‌ఐ రమేష్, టూరిస్ట్ పోలీసులు శ్రీకాంత్, బద్రు, శ్రీనివాస్, అరుణ్ తో పాటు రెవెన్యూ, పురావస్తు, దేవాదాయ, టూరిజం శాఖల సిబ్బందిలు పాల్గొన్నారు.