ఘనంగా ఏక్తా దివస్ వేడుకలు

31-10-2026 | 11:08pm

గోవిందరావుపేట,(విజయక్రాంతి): జాతీయ ఐక్యతకు ప్రతీకగా నిలిచిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని శనివారం 5వ బెటాలియన్ టీజీఎస్పీ, చల్వాయిలో ఏక్తా దివస్ వేడుకల(Ekta Diwas Celebrations)ను ఘనంగా నిర్వహించారు. బెటాలియన్ కమాండెంట్ సి.వి. లక్ష్మీకాంతరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ... దేశ సమగ్రత, ఐక్యత, భద్రతను కాపాడటంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ప్రతిభ కనబరిచి ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు కమాండెంట్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ అధికారులు, సహాయ కమాండెంట్ అరుణ్ రాజ్ కుమార్, ధర్మారావు, ఆర్ ఐ లు భాస్కర్, సాయిబాబు, వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు