మండలంలో అనధికారిక విద్యుత్ కోతలు

22-09-2026 | 06:19pm

ఒక వైపు ఎల్ నినో ప్రభావం

మరో వైపు విద్యుత్ కోతలు

అరకొర విద్యుత్తుతో మిర్చి రైతుల అవస్థలు

ఆందోళనలో మిర్చి రైతులు

పట్టించుకోని అధికారులు

కన్నాయిగూడెం, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) కన్నాయిగూడెం మండలంలో అనధికార విద్యుత్ కోతలతో రైతన్నలు అవస్థలు పడుతున్నారు... విద్యుత్ కోతల విషయం ముందస్తు సమాచారం ఇవ్వకుండా విద్యుత్ నిలిపివేయడంతో మిర్చి రైతులు అవస్థలు పడుతున్నారు. మండలంలోని కంతనపల్లి, ఏటూరు, చింతగూడెం, బుట్టాయిగూడెం, ముప్పనపల్లి, గూర్రేవుల, సర్వాయి, రాజన్న పేట, లక్ష్మిపురం, గంగూడెం, తుపాకులగూడెం, దేవాదుల గ్రామాల్లో ఎక్కువగా మిర్చి సాగు  

అవుతుంది. మిర్చి నారు మడులు, నర్సరీల్లో నీటిని రోజుకు 3-4 సార్లు  పట్టాల్సి వస్తుంది.ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో క్రమం తప్పకుండా నీటిని అందించాల్సిన అవసరం ఉంటుంది.. ఎల్ నినో ప్రభావంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో రోజుకు 3-4 సార్లు నీటిని పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది .మండలాన్ని 2 భాగాలుగా విభజించి 2 విద్యుత్ సబ్ స్టేషనన్లు ఏర్పాటు చేసి గృహ అవసరాలకు వ్యవసాయ అవసరాలకు కరెంటు అందిస్తున్నారు.. విద్యుత్ సబ్ స్టేషన్ల పరిధిలో ఎలాంటి మరమ్మత్తులు ఉన్న కూడా 2వ శనివారం ముందస్తు సమాచారం 

అధికారిక వాట్సాప్ గ్రూప్ మరియు గ్రామాల్లో  ఉన్న గ్రూప్స్  ద్వారా లైన్ మెన్స్ సమాచారం ఇస్తూ మరమ్మత్తులు చేసే వారు కానీ కొద్ది రోజుల నుంచి కరెంటు నిలిపివేత  సమయం మరియు  కరెంటు వచ్చే సమయాల్లో కూడా సమయపాలన పాటించడం లేదని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. త్రీ ఫేస్ కరెంటు ఇచ్చే సమయాల్లో కూడా అనధికార కరెంటు కోతలతో ఇబ్బందులు పడుతున్నామని మిర్చి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చేన్లల్లో ఉన్న సమయాల్లో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు...విద్యుత్ సిబ్బంది మరమ్మత్తు పనులను త్రీ ఫేస్ కరెంటు వచ్చే సమయాల్లో కాకుండా సింగల్ ఫేస్ కరెంటు ఉండే సమయాల్లో పనులు చేసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు... విద్యుత్ సిబ్బంది ఇష్టం వచ్చినట్టు కరెంటు బంద్ చేసి మరమ్మత్తులు చేయడంతో ప్రభుత్వం అందిస్తున్న విద్యుత్ పై ప్రజలకు అపోహలు వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పటికైనా విద్యుత్ సిబ్బంది స్పందించి అనధికారిక విద్యుత్ కోతలు లేకుండా చూడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు...

మరిన్ని వార్తలు