జిఎంఆర్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవ వేడుకలు
22-09-2026 | 07:02pm
పటాన్ చెరు, సెప్టెంబర్ 22: పటాన్ చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి ప్రభుత్వ పాఠశాల గురుపూజోత్సవ వేడుకలకు అదనపు కలెక్టర్ పాండు, జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న 100 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.