ఆర్బిఎస్కే సేవలను పరిశీలించిన డీఎంహెచ్ఓ

22-09-2026 | 07:27pm

జైపూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని కేజీబీవీలో ఆర్బిఎస్కే బృందాల ద్వారా అందిస్తున్న వైద్య సేవలను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారీ డాక్టర్ నరేందర్ రాథోడ్ మంగళవారం ఉప జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్(Health Department Official Dr. Sudhakar Naik)తో కలిసి పరిశీలించారు. కేజీబీవీ కళాశాలను ఆకస్మికంగా సందర్శించి ఆర్బిఎస్కే వైద్య బృందాల ద్వారా అందిస్తున్న వైద్య సేవలపైన సమీక్ష చేశారు.

విద్యార్థులు వ్యాధులు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, కీటక జనిత వ్యాధులు, దోమలు కుట్టడం ద్వారా వచ్చే వ్యాధుల గురించి, మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియాపై అవగాహన కలిగించారు. నీటి ద్వారా వచ్చే వ్యాధులు జాండీస్ అతి సారంపైన అవగాహన కల్పించారు. అనంతరం కళాశాలలో అందిస్తున్న పోషకాహార పదార్థాలను వంట సామాగ్రిని, వంట పదార్థాలను పరిశీలించారు.

మరిన్ని వార్తలు