రిపోర్టర్‌కు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పరామర్శ
జడ్చర్ల, నవంబర్ 28 (విజయక్రాంతి): జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు తాంబూలం శ్రీనివాస్ సతీమణి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆయన కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.
శుక్రవారం సాయంత్రం రిపోర్టర్ శ్రీనివాస్ నివాసానికి వెళ్లిన లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కష్ట సమయంలో అన్ని విధాలుగా అండగా ఉంటానని (Support) హామీ ఇచ్చారు. చిన్న వయసులోనే ఇలాంటి విషాదం జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. భగవంతుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని (Courage) ప్రసాదించాలని, పిల్లలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ మాజీ కూడుగల్ యాదయ్య, హఫీజ్ రెహమాన్, మాజీ కౌన్సిలర్లు సతీష్, నందకిషోర్ గౌడ్, ఇంతియాజ్, శ్రీకాంత్, శంకర్ నాయక్, పాలాది రాంమ్మోహన్, ఇర్ఫాన్, కరాటే శీను, నిజాం, మచ్చల శీను తదితరులు పాల్గొన్నారు.