సంగమేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న జనసేన పార్టీ ఎమ్మెల్యే

13-10-2026 | 06:07pm

కొల్లాపూర్ అక్టోబర్ 13: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల కేంద్రంలోని  సోమశిలలో టూరిజం చాలా బాగుందని పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు(MLA Chirri Balaraju) దంపతులకు టూరిజం అభివృద్ధి గురించి వివరించిన జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ. సంగమేశ్వరం ఆలయాన్ని నదిలో నుంచే విక్షించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దంపతులు. కొల్లాపూర్ మండలం సోమశిల క్షేత్రాన్ని ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దంపతులు సందర్శించారు.

టూరిజం బోటింగ్ లో జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ తో కలిసి కృష్ణనది లో ఉన్న సంగమేశ్వర ఆలయాన్ని విక్షించి ఆలయ చరిత్ర గురించి అడిగి తెలుసుకున్నారు.టూరిజం పరంగా సోమశిల గ్రామం చాలా అభివృద్ధి చెందింది అని వారు అన్నారు. అనంతరం ఏకో పార్క్ నుంచి వాచ్ టవర్ దగ్గరికి వారిని తీసుకెళ్లి అక్కడి నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావు  ఆధ్వర్యంలో జరుగుతున్న టూరిజం అభివృద్ధి గురించి వారికి వివరించడం జరిగింది.

మరిన్ని వార్తలు