పెంట్లవెల్లి లోని సాగు నీళ్లును అమ్ముకుంటున్న దొంగలు

08-10-2026 | 02:32pm

పెంట్లవెల్లి అక్టోబర్ 8: నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం కేంద్రంలోని చౌట చెరువు నుంచి నీళ్లను అక్రమంగా కొంతమంది చింతలపల్లి గ్రామానికి చెందిన వ్యక్తులకు అమ్ముకుంటున్నారని పెంట్లవెల్లి రైతులు ఆరోపిస్తున్నారు.

సుమారుగా పెంట్లవెల్లి చౌట చెరువు కు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో రామాపురం కత్వా  నుండి పెంట్లవెల్లి చెరువుకు రైతులు నీటిని తీసుకువస్తుంటే పెంట్లవెల్లికి చెందిన  కొంతమంది వ్యక్తులు చెరువులోనే  80 నుంచి 90 మోటర్లు పెట్టి ఆరు కిలోమీటర్లు చింతలపల్లికి రైతులకు సాగు నీటిని తరలిస్తున్నారని ఆ గ్రామంలో  సుమారుగా 300 ఎకరాల సాగును తడిపి ఆ రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

ఇంత జరుగుతున్నా ఎమ్మార్వో ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడంలేదని రైతుల ఆరోపిస్తున్నారు. అధికారులకు కూడా ముడుపులు మూడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సాగునీటిని ఆపివేయకపోతే రానున్న రోజుల్లో పెంట్లవెల్లి లోని మూగజీవాలకు నీళ్లు దొరికే అవకాశం కష్టమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు