సబ్ స్టేషన్ ఏర్పాటు కు స్థల పరిశీలన

08-10-2026 | 02:35pm

దామరచర్ల :అక్టోబర్ ;8: మండలం లోని బాలాజీ నగర్ తండ గ్రామపంచాయతీ(Balaji Nagar Thanda Gram Panchayat) పరిధిలో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ (KV Electrical Substation)ఏర్పాటు చేయడానికిస్ అధికారులు గురువారం స్థల పరిశీలన చేపట్టారు.తహసీల్దార్ బానోత్ జవహర్ లాల్, విద్యుత్ శాఖ ఏఈ హమీద్ అబ్దుల్లా లు ప్రతిపాదిత సబ్‌స్టేషన్ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ బాలాజీ నగర్ తండతో పాటు పరిసర గ్రామాలు, తండాలకు విద్యుత్ సరఫరాను మరింత మెరుగుపరచడం, లో-వోల్టేజ్ సమస్యలను తగ్గించడం, వ్యవసాయ మరియు గృహ విద్యుత్ అవసరాలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఈ సబ్‌స్టేషన్ ఏర్పాటు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు.

సబ్‌స్టేషన్ ఏర్పాటు ద్వారా స్థానికంగా విద్యుత్ సరఫరా వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు రైతులు, గ్రామీణ ప్రజలకు గణనీయమైన ప్రయోజనం కలుగుతుందని అన్నారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన విద్యుత్ మౌలిక వసతుల కల్పనకు అధికారులు సహకరిస్తున్నందుకు  గ్రామ సర్పంచ్ రాధా రమణ , పంచాయతీ కార్యదర్శి సోమేష్ కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు