కోహెడ ఎంపీడీఓ కు సన్మానం
కోహెడ, అక్టోబర్ 8,(విజయక్రాంతి): కోహెడ ఇంచార్జి ఎంపీడీఓ(In-charge MPDO) ఇటీవల బాధ్యతలు చేపట్టిన నర్ర మహిపాల్ రెడ్డిని(Narra Mahipal Reddy) గురువారం మండల సిపిఐ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
మండలంలోని గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర సమస్యలను ఎంపీడీఓ కు విన్నవించి నట్లు పేర్కొన్నారు. అలాగే శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు ముంజ గోపి, కురెళ్ల గ్రామ కార్యదర్శి బండారి లక్ష్మణ్, సీనియర్ కామ్రేడ్ ఆకుల నర్సయ్య, సత్తి రెడ్డి, వెంకయ్య, రాజయ్య, ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి రాసూరి యుగేందర్, కందుకూరి అంతయ్య, భాస్కర్ పాల్గొన్నారు.