అక్రమ భూ రిజిస్ట్రేషన్ తహసీల్దార్ సస్పెన్షన్
- అయ్యవారిపల్లి భూ వ్యవహారంపై కలెక్టర్ ఆగ్రహం
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): అక్రమ భూ రిజిస్ట్రేషన్లు(Illegal Land Registrations), విధుల నిర్వహణలో నిర్లక్ష్యంపై ఉప్పునుంతల తహసీల్దార్ ఎ. సునీత(Nagarkurnool Tahsildar A. Sunitha)పై సస్పెన్షన్ వేటు పడింది. అయ్యవారిపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 115లో 13.17 గుంటల భూమి ఇతరుల పేర్లపై నమోదైన వ్యవహారంపై విచారణ నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్(Collector Hemant Keshav Patil) సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ వ్యవహారంపై అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రా విచారణ చేపట్టి పాత పహాణీలు, ఖాస్రా, ఆర్ఓఆర్, భూభారతి పోర్టల్, రిజిస్ట్రేషన్ రికార్డులను పరిశీలించారు. కొన్ని భూ నమోదులు అసలు రెవెన్యూ రికార్డులకు పొంతన లేక పత్రాల ధ్రువీకరణలో లోపాలు ఉన్నట్లు నివేదికలో వెల్లడించారు. అప్పట్లో చారకొండ తహసీల్దార్‌గా పనిచేసిన సునీత విధుల నిర్వహణలో విఫలమైనట్లు గుర్తించడంతో తెలంగాణ సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. క్రమశిక్షణా విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ అమల్లోనే ఉంటోంది.