ఉపాధ్యాయ సేవలు చిరస్మరణీయం

31-10-2026 | 08:03pm

- పదవీ విరమణ పొందిన అజ్జే రవీందర్‌కు ఘనంగా అభినందనలు

నాగల్‌గిద్ద,(విజయక్రాంతి): కంగ్టి మండల పరిధిలోని నాగూర్ కె. ప్రాథమిక పాఠశాల(Nagur K Primary School) ఎల్‌ఎఫ్‌ఎల్‌ ప్రధానోపాధ్యాయులు అజ్జే రవీందర్, మల్లేశ్వరి దంపతుల పదవీ విరమణ అభినందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ వృత్తిలో రవీందర్ అందించిన విశిష్ట సేవలను, విద్యార్థుల అభ్యున్నతికి, విద్యారంగ అభివృద్ధి(Development of Education Sector)కి చేసిన కృషిని పలువురు వక్తలు కొనియాడారు. అంకితభావంతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నాగల్‌గిద్ద మండల విద్యాధికారి మన్మధ కిషోర్, నాగల్‌గిద్ద కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సిద్ధారెడ్డి, పీఆర్‌టీయూ టీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పాండురంగారెడ్డి, మండల అధ్యక్షులు శేరికార్ రమేష్, మండల అసోసియేట్ అధ్యక్షులు విజేందర్‌రెడ్డి, పెద్ద గోపులారం ప్రధానోపాధ్యాయులు భాస్కర్, గంగాపూర్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి, విట్టల్‌రెడ్డి తదితర ఉపాధ్యాయులు, ప్రముఖులు పాల్గొని పదవీ విరమణ పొందిన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. పదవీ విరమణ అనంతరం వారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు