నాగల్‌గిద్ద పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ వెంకట్‌రెడ్డి

31-10-2026 | 07:41pm

నాగల్ గిద్ద,(విజయక్రాంతి): నాగల్‌గిద్ద పోలీస్‌ స్టేషన్‌(Nagalgidda Police Station)ను నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి(DSP Venkat Reddy) శనివారం వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్‌ స్టేషన్‌లోని రికార్డులు, నమోదైన కేసుల వివరాలు, కేసుల పురోగతిని పరిశీలించారు. సిబ్బంది విధుల నిర్వహణ తీరును సమీక్షించి, శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, ప్రజలతో మర్యాదపూర్వకంగా మెలగాలని తెలిపారు. అనంతరం సిబ్బంది యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, విధి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ పోలీస్‌ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐ కాశీపురం రామకృష్ణ, పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు