గుండ్లోరిగూడెం పంచాయతీకి అరుదైన ఘనత
- టీబీ రహిత పంచాయతీగా గుర్తింపు
- టీబీ ముక్త్ పంచాయత్–2025’ అవార్డు అందుకున్న సర్పంచ్ జంగిలి సునీత సాంబయ్య
మునుగోడు, అక్టోబర్ 8 (విజయకాంతి): మండలంలోని గుండ్లోరిగూడెం గ్రామ పంచాయతీ(Gundlorigudem Gram Panchayat) టీబీ రహిత పంచాయతీగా గుర్తింపు పొందింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘టీబీ ముక్త్ పంచాయత్–2025’ అవార్డుల కార్యక్రమంలో సర్పంచ్ జంగిలి సునీత సాంబయ్య జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు.
2025లో గ్రామంలో క్షయవ్యాధి గుర్తింపు, నియంత్రణ, చికిత్సలో మెరుగైన ఫలితాలు సాధించినందుకు ఈ గుర్తింపు లభించిందని సర్పంచ్ తెలిపారు. గ్రామ ప్రజల సహకారం, ఆరోగ్యశాఖ సిబ్బంది కృషి, టీబీపై నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు ఈ విజయానికి కారణమన్నారు. గుండ్లోరిగూడెం టీబీ రహిత పంచాయతీగా గుర్తింపు పొందడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ‘టీబీ హరేగా.. దేశ్ జీతేగా’ నినాదంతో గ్రామాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు.