మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో రసాభాస
మంచిర్యాల, (విజయక్రాంతి): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్(Municipal Corporation) సర్వసభ్య సమావేశంలో కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాల కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. గురువారం జరిగిన సమావేశంలో కార్పొరేషన్ లో నెలకొన్న సమస్యల పరిష్కారంలో అధికారులు వివక్ష చూపుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికార కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య బహిరంగ వాగోదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే వర్గానికి చెందిన కార్పొరేటర్లకు, అసమ్మతి వర్గం కార్పొరేటర్లు సమస్యలపై చర్చ సందర్భంగా పరస్పరం అభ్యంతరాలు వ్యక్తం చేసుకున్నారు. కార్పొరేషన్ లోని అనే డివిజన్లకు నిధులు కేటాయించడం లేదని, కొన్ని డివిజన్లోకి నిధులు వెచ్చిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా కార్పొరేటర్లు అయితే ఓ సమయంలో కోట్లాడుకుంటారేమో అనేంత వరకు వెళ్ళింది. రసాభాసతో సమావేశం సాగింది.