5 September, 2026 | 7:30 PM

పేదింటి వివాహానికి ఎస్ఎస్ సేవా సమితి ఆర్ధిక సాయం

05-09-2026 | 05:56pm

దామరచర్ల :సెప్టెంబర్6,(విజయ క్రాంతి): దామరచర్ల మండలంలోనీ కొండ్రపోల్(Kondrapol) గ్రామానికి చెందిన నక్క సైదులు కూతురి వివాహానికి పదివేల  ఆర్థిక సాయాన్ని శనివారం ఎస్ ఎస్ సేవా సమితి సభ్యులు(SS Seva Samithi Members) ఆదావత్ జైత్రం నాయక్ అందజేశారు. వివాహా కార్యక్రమంకు హాజరై చెక్కు(Cheque)ను అందజేసి , నూతన దంపతులను ఆశీర్వదించి వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు శ్రీధర్ ,రాజేష్ ,పవన్ తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు